Sakshi News home page

సీఎం పట్టుదలతో కాళేశ్వరం పరుగు

Published Sun, Mar 18 2018 7:16 AM

Kaleshwaram Project  Works On Fast Track says Harish Rao - Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి మహదేవపూర్‌ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు బ్యారేజీలు, పంపు హౌస్‌ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రావిటీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. 

కాళేశ్వరం: సీఎం కేసీఆర్‌ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహదేవపూర్‌ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. అనంతరం సీ–5 క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల్లో 5.81 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా ఇందని, 4.50 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని జరిగినట్లు ఆయన తెలిపారు. 58.46 లక్షల కాంక్రిట్‌ పనికి 30 లక్షల కాంక్రిట్‌ పని పూర్తయిందని తెలిపారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌లకు 4.5 కోట్ల సిమెంట్‌ బస్తాలు అవసరమవుతాయని వివరించారు.

రాడ్స్‌( స్టీలు) 2.65 లక్ష మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా.. 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ద్వారా వివిధ దశల్లో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రావిటీ కాల్వలో 1.80 కోట్ల మట్టి పనులకు 1 కోటి క్యూబిక్‌ మీటర్లు పూర్తయిందన్నారు. 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. గ్రావి టీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా పనులు చేయడానికి అదనంగా ఇంజనీర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నట్లు చెప్పారు. గ్రావిటీ కెనాల్‌లో రోజుకు 1.70 లక్షల క్యూబిక్‌ మీటర్ల రికార్డు లెక్కన మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. మేడిగడ్డలో 15.50 లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాల్సి ఉండగా.. రోజులు 5 వేల క్యూబిక్‌ మీటర్లు కాంక్రిట్‌ పని చేస్తున్నట్లు వివరించారు.

రోజుకు 7 వేలకు పెంచాలని సూచించినట్లు తెలిపారు. అన్నారం బ్యారేజీలో 11 లక్షల క్యూబిక్‌ మీటర్లకు 7.50 లక్షలు పూర్తయిందన్నారు. సుందిళ్ల బ్యారేజీలో 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌కు 6.50 లక్షల పూర్తయిందని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్‌ అన్ని అప్రూవల్స్‌ వచ్చాయని, గ్రావిటీ కెనాల్‌లో 29 స్ట్రక్చర్స్‌ ఉన్నాయన్నారు. పంపుహౌస్‌లకు మెటీరియల్‌ షిప్పింగ్‌ ద్వారా స్పైరల్‌ డాప్ట్‌ ట్యూబు, పంపులు, మోటార్లు ఏప్రిల్‌ వారంలోగా వస్తున్నాయన్నారు. ఆస్ట్రియా, స్విట్జర్‌లాండ్, జర్మనీ దేశాల ద్వారా వస్తున్న ట్లు వివరించారు. మూడు పంపుహౌస్‌ల వద్ద 400, 220, 220 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం ఏప్రి ల్‌ వరకు పూర్తవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్, కాళేశ్వరం బ్యారేజీ సీఈ నల్ల వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈలు మల్లికార్జున్‌ ప్రసాద్, రమణారెడ్డి, డీఈ ఈలు ప్రకాష్, యాదగిరి, సూర్యప్రకాష్, ఆప్‌కాన్‌ డైరెక్టర్‌ మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. డీఎస్పీ   ప్రసాదరావు, సీఐ రమేష్‌  బందోబస్తు నిర్వహించారు. 

మేడిగడ్డ, పోచంపల్లి బ్యారేజీ పనుల పరిశీలిన..
మహదేవపూర్‌: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని సీపీఐ మావోయిస్టు ఇలాఖాలో శనివారం  మంత్రి హరీష్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, పోచంపల్లి వద్ద బ్యారేజీలను, కన్నెపల్లి–అన్నారం పంపుహౌస్‌లు, కన్నెపల్లి–అన్నారం గ్రావిటీ కె నాల్‌ పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు అన్నారం చేరకున్న మంత్రి రాత్రి 7 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. పనుల పురోగతిపై చర్చించారు.   

Advertisement
Advertisement